¡Sorpréndeme!

DC vs MI Match Highlights IPL 2025 | ఢిల్లీపై 12 పరుగుల తేడాతో ముంబై సంచలన విజయం | ABP Desam

2025-04-13 2 Dailymotion

 ఊహించని ట్విస్టులు, అదిరిపోయే షాకులు..సినిమాను తలపించే హీరోయిక్ ఫర్ ఫార్మెన్సులు, నరాలు తెగిపోయే ఉత్కంఠతో క్లైమాక్స్ లు. మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ మాత్రం ఓ అబ్సల్యూట్ సినిమాను తలపించింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ సంచలన విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.    1.  రికెల్టన్, సూర్య షో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ నిర్ణయం తప్పు అనిపించేలా ముంబై బ్యాటర్లు దుమ్మురేపారు.ప్రధానంగా రోహిత్ శర్మ ధాటిగా ఆడే ప్రయత్నంలో రెండు ఫోర్లు, ఓ సిక్సు బాది 18 పరుగులకే అవుటైపోయినా...ర్యాన్ రికెల్టన్, సూర్య కుమార్ యాదవ్ మాత్రం ఓపికగా ఆడారు.  రికెల్టన్ 25 బాల్స్ లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 41పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయితే..స్కై 28 బాల్స్ లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 40 పుగులు చేసి అదే కుల్దీప్ బౌలింగ్ లో అవుటైపోయాడు. కానీ అప్పటికే టీమ్ స్కోరు 13 ఓవర్లలో 135 పెట్టి పది రన్ రేట్ ను మెయిన్ టైన్ చేశారు